అఖిల్ సెకండ్ సినిమాకి డైరెక్టర్ ఫిక్స్!
- May 30, 2016 / 10:48 AM ISTByFilmy Focus
అసలు తలాతోక లేని ఓ సూపర్ ఫ్లాప్ సినిమాతో అత్యంత ఘనంగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని మూడోతరం నటవారసుడు అక్కినేని అఖిల్ కు తన సెకండ్ సినిమా డిసైడ్ చేసుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టింది. అఖిల్ రెండో చిత్రం ఓ హిందీ సినిమాకు రీమేక్ అని, ఆ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని వార్తలొచ్చాయి. రీమేక్ అని కన్ఫర్మ్ చేయనప్పటికీ.. అఖిల్ రెండో సినిమా వంశీ దర్శకత్వంలోనే అని నాగార్జున కూడా ఎనౌన్స్ చేశాడు.
అయితే.. ఇప్పుడు సమీకరణలు మారాయి. దాంతో అఖిల్ తన రెండో సినిమాకు దర్శకుడిగా వంశీకి బదులుగా కొరటాల శివను ఎంచుకొన్నాడని తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం “కమ్మటిపాదం”కు రీమేక్ గా సదరు సినిమా ఉండబోతోందని వార్తలొస్తున్నప్పటికీ.. అఫీషియల్ గా ఎటువంటి ఎనౌన్స్ మెంట్ లేదు.
కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాని డివివి దానయ్య నిర్మించనున్నాడట!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












