మానవీయ బంధాలను కమర్షియల్ ఫార్మాట్ లో సగటు సినిమా అభిమానికి అర్ధమయ్యేలా చెప్పిన ఘనత క్రిష్ సొంతం. ఆయన తీసిన “గమ్యం, వేదం, కంచె” సినిమాలు చూస్తే ఆ విషయం అవగతమవుతుంది. ప్రస్తుతం నందమూరి నాటసింహం బాలకృష్ణను “గౌతమిపుత్ర శాతకర్ణి”గా అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్న క్రిష్ త్వరలోనే పెళ్లి చేసుకోనూన్నాడు.
హైద్రాబాద్ కు చెందిన రమ్య అనే డాక్టర్ తో క్రిష్ కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని కుదిర్చారు. క్రిష్ కూడా రమ్యను ఇష్టపడ్డాడని, త్వరలోనే వీరి వివాహం జరగనుందని క్రిష్ కుటుంబ సభ్యులు తెలిపారు. మరి వీరి వివాహం “శాతకర్ణి” విడుదలైన తర్వాత అవుతుందో లేక విడుదలకు ముండే జరిగిపోతుందో తెలియాలంటే.. కొంత కాలం ఆగాల్సిందే!