లెజెండ్ నందమూరి బాలకృష్ణ డైలాగ్ చెబుతుంటే ఫిరంగి నుంచి నిప్పుల గుండ్లు వస్తున్నట్లు ఉంటాయి. అందుకే నట సింహా సినిమాలో దర్శకులు భారీ డైలాగ్లు పెడుతుంటారు. వెండి తెరపై తమ అభిమాన హీరో పవర్ ఫుల్ డైలాగ్లు చెబుతుంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ సంబర పడిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని డైరక్టర్ క్రిష్ బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి లో కూడా మంచి డైలాగ్లు రాయించారు. ఈ సినిమా ఎవరిని నిరాశపరచ కూడదని క్రిష్ కష్టపడుతున్నాడు. దీంతో బాలయ్య రికార్డులను తిరగరాయాలని ఆశిస్తున్నాడు.
ఈ చిత్రం మొదటి షెడ్యుల్ మొరాకో లో పూర్తిచేసుకుంది. అక్కడ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. సోమవారం నుంచి హైదరాబాద్ లోని చిలకూరి బాలాజీ ఆలయం సమీపంలో రెండో షెడ్యూల్ మొదలయింది. ఈ షూటింగ్లో బాలకృష్ణ డైలాగ్ డెలివిరీ చూసి క్రిష్ అభినందించక ఉండలేక పోతున్నాడు. “సాయి మాధవ్ రాసిన మాటలు అతని నోటి గుండా ఎంతో శక్తి వంతంగా మారి వస్తున్నాయి. బాలయ్య డైలాగ్ చెబుతుంటే కట్ చెప్పడమే మరిచిపోతున్నా” అని క్రిష్ చెప్పాడు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకు పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.