దర్శకుడు క్రిష్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిబంధనల్లో భాగంగా యూనిట్ లో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో క్రిష్ కి పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయన హోమ్ క్వారెంటైన్ లోకి వెళ్లిపోయాడు. దీంతి ఇప్పుడు పవన్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడేట్టు కనిపిస్తోంది.
ఈ సినిమా కోసం కాస్త వర్క్ చేసిన వెంటనే.. పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా మీదకు వెళ్లిపోయారు. దీంతో క్రిష్ ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా ఓ సినిమాను పూర్తి చేశాడు. ఈలోగా పవన్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో క్రిష్ తన సినిమా కోసం పవన్ ని కొన్ని రోజుల పాటు డేట్స్ ఇవ్వమని కోరాడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం వేసిన సెట్ అలానే ఉంది.
దానికోసం చాలా డబ్బు కట్టాల్సి వస్తోంది. కనీసం ఆ సెట్ లో చేయాల్సిన షూటింగ్ కైనా హాజరు కావాలని పవన్ ని అడగడంతో ఫైనల్ గా ఆయన డేట్స్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో క్రిష్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో రెండు వారాల వరకు షూట్ చేయలేని పరిస్థితి. ఈలోగా పవన్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ మీదకు వెళ్లిపోతాడు. ఆ సినిమా పూర్తయ్యే వరకు క్రిష్ ఎదురుచూడాల్సిందే.!