2014 లో కన్నడలో తెరకెక్కిన ‘ఉగ్రం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ నీల్. ఆ ఏడాదికి ఆ మూవీ అక్కడ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ వెంటనే రెండో చిత్రంగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ను చేసాడు. ముందుగా ఈ చిత్రాన్ని కన్నడలో మాత్రమే తెరకెక్కించాలి అనుకున్నాడు ఈయన. ఆ తర్వాత మిగిలిన భాషల్లోకి డబ్ చేయాలి అనుకున్నాడు. కానీ సెట్స్ పైకి వెళ్ళాక మనసు మార్చుకుని దీనిని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసాడు.
ఫలితం అనుకూలంగా వచ్చింది. ఇటీవల విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో అతను పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం ఇతనితో సినిమాలు చేయడానికి అన్ని భాషల్లో ఉన్న స్టార్ హీరోలు ఎగబడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇతని ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :