కరోనా, లాక్ డౌన్ కారణంగా దర్శకులకు పని లేకుండా పోయింది. సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో కొందరు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. మరికొంతమంది తమ స్క్రిప్ట్ లను మెరుగుదిద్దుకుంటున్నారు. అయితే యంగ్ డైరెక్టర్లు మాత్రం ఈ టైమ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఓటీటీలకు కథలను రాసి.. డబ్బు చేసుకుంటున్నారు. ‘అ!’ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఆ తరువాత ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాలను రూపొందించారు.
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు హాట్ స్టార్ కోసం ఓ కథను అందించాడట. ప్రశాంత్ వర్మ అందించిన కథతో హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఓటీటీలకు సరిపడే మరో రెండు కథలు తన దగ్గర ఉన్నాయని.. ఒకటి హిందీలో మరొకటి తెలుగులో రాబోతుందంటూ ప్రశాంత్ వర్మ స్పష్టం చేశారు. ఇక తన తదుపరి చిత్రం కోసం కొత్త జోనర్ ను ఎన్నుకున్నానని.. చాలా ఎంటెర్టైనింగ్ గా ఉంటుందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా సమంత ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్ లో కనిపించబోతుందనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. సమంతకి కథ చెప్పిన మాట నిజమేనని కానీ.. అది కొత్త కథ అని అన్నారు. సమంతకి కుదిరినప్పుడు తను వేరే ప్రాజెక్ట్ తో బిజీ ఉన్నట్లు.. తను ఖాళీ ఉన్నప్పుడు సమంత బిజీగా ఉండడంతో ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయానని.. ఆలస్యమైనా తమ కాంబినేషన్ లో సినిమా పక్కా ఉంటుందని చెప్పుకొచ్చారు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!