‘చందమామ కథలు’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు ప్రవీణ్ సత్తారు. ఈ చిత్రంతో ప్రేక్షకులతో పాటూ విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. దీని తరువాత ‘గుంటూరు టాకీస్’ అనే బోల్డ్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంతో ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక ఎన్నో ఏళ్ళు గా ఒక్క హిట్టు కోసం వేస్తున్న… యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కి ‘గరుడ వేగ’ చిత్రంతో మంచి హిట్టు ఇచ్చాడు. అయితే ఈ మూడు చిత్రాలని పరిశీలిస్తే… మూడు కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్న చిత్రాలు. ఇలా ఏ కథనైనా హ్యాండిల్ చేయగల ‘కెపాసిటీ’ ఉన్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం.. రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంలో పొపులర్ అయిన ‘శివగామి’ క్యారెక్టర్ కి సంబందించిన వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్. ఇక తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్యతో ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ ఆడియన్స్ కి సర్ప్రైజింగ్ గా ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల ప్రవీణ్… చైతూని కలిసి కథ వినిపించగా.. వెంటనే చైతూ ఓకే అనేసాడట. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఖాయమని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గతంలో రామ్ తో ఓ చిత్రాన్ని మొదలు పెట్టాడు ప్రవీణ్ సత్తారు. అయితే బడ్జెట్ సమస్యల వల్ల ఆ చిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే చిత్రాన్ని చైతూ తో.. ప్రవీణ్ తెరకెక్కిస్తున్నాడా…? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక నాగచైతన్య ప్రస్తుతం ‘మజిలీ’ చిత్రంలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. ఇక దీని తరువాత ‘వెంకీ మామ’ చిత్రంలో కూడా నటించబోతున్నాడు చైతన్య.ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే.. ప్రవీణ్ సత్తారు సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది.