Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movies » Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

  • October 28, 2026 / 11:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్'(Killer). ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

Killer

పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. “కిల్లర్” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్ లో “కిల్లర్” మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ సీతారామ్ మాట్లాడుతూ – నేను ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేయడంతో పాటు ఒక క్యారెక్టర్ లో నటించాను. నా పాత్ర ఈ కథలో ఎంత కీలకంగా ఉంటుంది అనేది తెరపై చూడాలి. మా సినిమా కోసం టీమ్ అంతా హార్డ్ వర్క్ చేశారు. వారి కష్టాన్ని మీరు మూవీలో చూడబోతున్నారు. అన్నారు.

నటి మానస మాట్లాడుతూ – నేను ఈ చిత్రంలో నటించినా కథలోని ట్విస్ట్ ఏంటో మాకూ తెలియదు. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఈ నెల 30న థియేటర్స్ లో చూసి మీరే తెలుసుకోవాలి. మా డైరెక్టర్ గారి కాన్ఫిడెన్స్ చూసి మాలోనూ సినిమా సక్సెస్ మీద నమ్మకం పెరుగుతోంది. మా సినిమాను ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు చంద్రకాంత్ మాట్లాడుతూ – మా డైరెక్టర్ సుకు సూపర్బ్ స్పీచ్ ఇచ్చారు. మా చిత్రంలో నాతో పాటు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మా మూవీలో ఉన్నాయి. మీకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తారని మహిళల కోసం ఒక కాంటెస్ట్ పెట్టాం. నేను జ్యోతి గారిని అదే ప్రశ్న అడిగితే మహిళలు సహజంగానే సూపర్ పవర్స్ ఉన్నవారు అని చెప్పారు. ఒక బిడ్డకు జన్మనిచ్చే శక్తి మహిళకే ఉంటుంది. ఈ సినిమాలో సూపర్ షీ తన పవర్స్ తో చేసే మ్యాజిక్ చూస్తారు. అన్నారు.

నటుడు గౌతమ్ చక్రధర్ మాట్లాడుతూ – ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేశాను. మా లైన్ ప్రొడ్యూసర్ దశరధ మాధవ్ వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. మా డైరక్టర్ గారు టాలీవుడ్ కు దొరికిన ఒక టాలెంటెడ్ ఫిలింమేకర్. కోటి రూపాయల కాంటెస్ట్ ద్వారా ప్రేక్షకుల్ని మన సినిమాలో ఇన్వాల్వ్ చేయిస్తున్నారు. మాకు కూడా ఆ ట్విస్ట్ ఏంటో తెలియదు. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే ప్రేక్షకులకు కిల్లర్ మూవీ థియేటర్స్ లో బెస్ట్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. మా సినిమాను థియేటర్స్ లో చూడండి. అన్నారు.

నటుడు మనీష్ గిలాడా మాట్లాడుతూ – పూర్వాజ్ గారు రూపొందించిన మాస్టర్ పీస్ సినిమాలో నటించాను. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. నటుడిగా మారాలనే నా కల తీరిన సంతోషం కలుగుతోంది. .ఈ సినిమాను మేమంతా ప్యాషన్ తో చేశాం. ప్రతి నటుడు, టెక్నీషియన్ మోటివేట్ అయ్యి తమ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారు. డబ్బు కోసం ఎవరూ ఆలోచించలేదు. కిల్లర్ లో మేము ఫ్యూచర్ సినిమాను చూశాం, టాలీవుడ్ ను మించిన ప్రయత్నం చేశాం. మా ప్రయత్నానికి మీ అందరి సపోర్ట్ లభిస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.

నటుడు, లైన్ ప్రొడ్యూసర్ అయినాబత్తిన దశరధ మాట్లాడుతూ – తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానమే నటుడిగా నా అసలైన బలం అని నమ్ముతాను. మీరు మా కిల్లర్ మూవీని, నటుడిగా నన్ను ఆశీర్వదించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సినిమాలో నటిస్తూ లైన్ ప్రొడ్యూసర్ గా కూడా వర్క్ చేశారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల 30న మా సినిమా చూసేందురు రండి తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. మా మూవీ కోటి రూపాయల కాంటెస్ట్ లో పాల్గొనండి. మీలో ఎవరు కోటీశ్వరులు అవుతారు అనేది చూడాలని వెయిట్ చేస్తున్నా. డైరెక్టర్ పూర్వజ్ అన్న సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో సరికొత్త క్యారెక్టర్స్ తో ఈ సినిమాను రూపొందించారు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. జ్యోతి గారు డిఫరెంట్ రోల్స్ లో తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు ఒక ఎంగేజింగ్ సస్పెన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. మా కిల్లర్ సినిమాను మీరంతా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ – మా సినిమా రిలీజ్ కు వస్తోంది. రేపు సాయంత్రం ప్రీమియర్స్ చూస్తారు. మేము మా మూవీ గురించి చెప్పాల్సింది చెప్పాం. మా సినిమా ఎలా ఉండబోతోంది. కాస్ట్ అండ్ క్రూ ఎంత కష్టపడి పనిచేశారు అనేవి చెప్పాం. తప్పకుండా మేము సక్సెస్ మీట్ పెట్టుకుంటాం. మా సినిమా కోసం సూపర్ షీ కాంటెస్ట్ నిర్వహించాం. మీకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తారని వుమెన్ కోసం పెట్టిన ఈ కాంటెస్ట్ లో ఇన్స్ పైరింగ్ ఆన్సర్స్ పంపిన 8 మందిని సెలెక్ట్ చేశాం. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున ఈ వేదిక మీద అందించడం సంతోషంగా ఉంది. మనలోనే సూపర్ పవర్స్ ఉన్నాయి. మన దేశాన్ని అనునిత్యం కాపాడుతున్న సైనికులను సూపర్ పవర్స్ అనుకోవచ్చు. వారికి మా టీమ్ అంతా సెల్యూట్ చేస్తోంది. కిల్లర్ లాంటి బ్రిలియంట్ సబ్జెక్ట్ ను తెరపైకి తీసుకొస్తున్న పూర్వజ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. మా టీమ్ అందరూ సినిమా కోసం కష్టపడుతూ మా వెంటే నిలబడ్డారు. వారి నమ్మకమే ఈ రోజు ఈ వేదికకు అందరినీ తీసుకొచ్చింది. మా సినిమా విషయంలో సక్సెస్ అయ్యామనే భావిస్తున్నాం. అన్నారు

హైకోర్ట్ లాయర్ సురేష్ మాట్లాడుతూ – ఈ సినిమాకు కోటి రూపాయల కాంటెస్ట్ గురించి పూర్వాజ్ గారు నాతో చాలా డిస్కస్ చేశారు. మేము చర్చించుకున్న తర్వాత ఇందులో ఏ సమస్య లేదు అనే కన్ క్లూజన్ కు వచ్చాం. దర్శకుడిగా పూర్వాజ్ గారిలోని ధైర్యాన్ని, మంచితనాన్ని చూడండి. ఆయన తన సినిమా మీద నమ్మకంతో కోటి రూపాయల ఆఫర్ ప్రేక్షకులకు ఇస్తున్నారు. ఇలాంటి ఆఫర్ ఇప్పటిదాకా ఏ ఫిలింమేకర్ ఇవ్వలేదు. ఆయన ధైర్యాన్ని, నమ్మకాన్ని మనమంతా అప్రిషియేట్ చేయాలి. థియేటర్ లో సినిమా చూసి కథలోని ట్విస్ట్ ను ఊహించి చెప్పిన వారికే ఈ బహుమతి ఉంటుంది. నిజాయితీగా ఉన్నవారే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. ఆ ట్విస్ట్ ను ఊరికే ఊహించగలిగితే ఇంత పెద్ద మొత్తం బహుమతి ఇవ్వరు. మీరు సినిమా చూసేప్పుడు ఏకాగ్రతతో ఉండండి. పూర్వాజ్ ఇలాగే కాన్ఫిడెంట్ గా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ – మేము మా సినిమాకు కోటి రూపాయల కాంటెస్ట్ అనౌన్స్ చేయగానే అది ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. సక్సెస్ మీట్ లో విజేతను ప్రకటిస్తామని చెప్పాం. అయితే కొందరు మాత్రం సోషల్ మీడియాలో మీ సినిమా సక్సెస్ అయితే కదా, ఆ కోటి రూపాయలన్నా కలెక్షన్స్ వస్తాయా అని పోస్ట్ లు చేస్తున్నారు. మా ప్రమోషనల్ కంటెంట్ ఎగ్జైట్ చేస్తే వచ్చి సినిమా చూడమని అంటున్నాం. మా సినిమాలోని ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించాం.

అది ఊరికే చెప్పలేదు హైకోర్టు లాయర్ తో కొన్ని నిబంధనలతో అగ్రిమెంట్ రాయించి మరీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. మా మూవీ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ నెల 29న 10 గంటలకు ప్రీమియర్స్ ఉంటాయి. సినిమా సెకండాఫ్ లో వచ్చే మేజర్ ట్విస్ట్ ఏదైతో ఉందో, ఆ ట్విస్ట్ అలా అవడానికి ఒక మేజర్ రీజన్ ఉంటుంది. ఇంటర్వెల్ ఇచ్చిన 5 నిమిషాల్లో జస్ట్ వన్ లైన్ ఆన్సర్ మా వాట్సాప్ నెంబర్ 7330608675 కు పంపాలి. షో చూస్తున్న టికెట్ ఫొటో పెట్టి ఆన్సర్ రాయాలి.

ఆ ఐదు నిమిషాల్లో వచ్చిన మెసేజ్ లు అన్నీ ఈ మెబైల్ లో రికార్డ్ అయ్యి ఉంటాయి. మీరు పంపే సమధానం మా ఆన్సర్ తో పోలి ఉండాలి. మా జవాబు కూడా మేము డేట్ తో వీడియో రికార్డ్ చేసి పెట్టాం. సక్సెస్ మీట్ లో ఆ విజేతను ప్రకటిస్తాం. తక్కువ టైమ్ లో ఆన్సర్ పంపిన వారికి బహుమతి ఉంటుంది. మా మూవీ డీటెయిల్స్ మేము చాలా చెప్పాం. మా చిత్రంలో ఒక నావెల్టీ ఉంటుంది. అది ఇప్పటిదాకా మీరు ఏ సినిమాలో చూడలేదు. కిల్లర్ సినిమా ఒక్క చిత్రంతో ఆగిపోదు నాలుగైదు పార్ట్స్ రాబోతున్నాయి.

జ్యోతి వైవిధ్యమైన పలు పాత్రల్లో సూపర్బ్ పర్ ఫార్మెన్స్ చేసింది. తను ఈ సినిమా కోసం ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మా సినిమా సక్సెస్ అయి తీరుతుంది. అన్నారు.

‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Killer
  • #killer movie

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

1 hour ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

7 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

15 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

17 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

18 hours ago

latest news

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

57 mins ago
King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

3 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

4 hours ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

5 hours ago
R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version