రానా తో ‘ఘాజీ’, వరుణ్ తేజ్ తో ‘అంతరిక్షం’ విభిన్న విభిన్న చిత్రాలను తెరకెక్కించాడు సంకల్ప్ రెడ్డి. ఇందులో ‘ఘాజీ’ చిత్రం సూపర్ హిట్ అవ్వగా .. ‘అంతరిక్షం’ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రానికి మంచి రివ్యూలు, మౌత్ టాక్ వచ్చినప్పటికీ… కల్లెక్షన్లని మాత్రం రాబట్టలేకపోయింది. ఇక ఈ నేపధ్యంలో సంకల్ప్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటా.. అని ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తుంది.
అందుతున్న సమాచారం మేరకు సంకల్ప్ రెడ్డి మరో టెక్నికల్ అంశాలతో కూడిన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. తన మొదటి చిత్రాన్ని సముద్రంలో, రెండో చిత్రాన్ని అంతరిక్షంలో తెరకెక్కించిన సంకల్ప్.. తన మూడో చిత్రాన్ని మాత్రం నేల మీదే చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ చిత్రంలో కూడా తన మార్క్ కనిపించేలా అంటార్కిటికా మంచులో జరిగే పరిశోదనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్ళువడనున్నాయని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.