‘7/జి బృందావన కాలనీ’ ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సెల్వ రాఘవన్. తరువాతి ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలు ఏవీ ఇక్కడ పెద్దగా సక్సెస్ కాలేదు అయినా కూడా.. ఈ దర్శకుడి పై ఉండే సినిమాలకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇదిలా ఉండగా… ఈ తమిళ స్టార్ దర్శకుడు మరోసారి తండ్రవ్వడం విశేషం. ఆయన భార్య గీతాంజలి గురువారం నాడు (అంటే జనవరి 7న) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అదే విషయాన్ని ఈమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. వీరిది ఇది మూడో సంతానం కావడం విశేషం.సెల్వ రాఘవన్, గీతాంజలి దంపతులకు.. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. లీలావతి అనే పాప మరియు కుమారుడు ఓంకార్ కాగా… ఇప్పుడు ఇది మూడో సంతానం. ఈసారి కూడా మగ బిడ్డకే జన్మనిచ్చింది గీతాంజలి. ఇక ఈ బాబుకి రిషికేశ్ సెల్వరాఘవన్ అని నామకరణం చేసారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. దర్శకుడు సెల్వరాఘవన్ హీరో ధనుష్ కు అన్నయ్య అవుతాడన్న సంగతి తెలిసిందే.
ఇక సెల్వ రాఘవన్ కు గతంలో సోనియా అగర్వాల్ తో వివాహం జరిగింది. 2006 లో పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో 2010లో విడాకులు తీసుకున్నారు. ఇక ఆమె కూడా ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా గడుపుతుంది.