కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి జరగబోతున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.కరోనా ఎఫెక్ట్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఐశ్వర్య పెళ్లి జూన్ 27న ఫిక్స్ చేశారు. ప్రముఖ క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో ఐశ్వర్య వివాహం జరుగనుంది. పేండమిక్ కాబట్టి..ఎటువంటి ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగానే ఈమె వివాహం జరుగబోతోంది.తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది బంధు మిత్రులనే ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తుంది.
కోవిడ్ ఉదృతి తగ్గిన తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు శంకర్ అతని సన్నిహితులకు చెప్పారట. ఇక శంకర్ కూతురు.. ఐశ్వర్య ఓ డాక్టర్ అన్న సంగతి బహుశా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు.ఇక క్రికెటర్ రోహిత్ తండ్రి దామోదరన్ ఓ ఇండస్ట్రియలిస్ట్.ఇక ‘ఇండియన్ -2’ హోల్డ్ లో పడడంతో… రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా మూవీని అలాగే బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ను డైరెక్ట్ చేయనున్నారు శంకర్.