స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలోని పాటల కోసం కూడా శంకర్ కొన్నిసార్లు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. తాజాగా శంకర్ పెద్ద కూతురు వివాహాన్ని ఘనంగా జరిపించిన సంగతి తెలిసిందే. శంకర్ పెద్ద కూతురి పెళ్లి కోసం ఏకంగా 10కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో శంకర్ కూతురు వివాహం జరిగింది.
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావడం గమనార్హం. సోషల్ మీడియాలో శంకర్ కూతురు పెళ్లి ఖర్చు గురించి జోరుగా చర్చ జరుగుతుండగా పది కోట్ల రూపాయలు ఖర్చైందని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అయితే శంకర్ భారీ మొత్తం ఖర్చు చేసినా కరోనా నిబంధనల వల్ల సినీ, రాజకీయ ప్రముఖులలో ఎక్కువమందిని ఆహ్వానించలేదు. మహాబలిపురంలోని రిసార్ట్స్ లో శంకర్ కూతురి వివాహం జరిగింది.
శంకర్ కూతురి పెళ్లికి డెకరేషన్ బాగా చేయించడంతో పాటు కూతురి కొరకు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను కొనుగోలు చేశారని సమాచారం. మరోవైపు శంకర్ గత సినిమా భారతీయుడు2 కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో ప్రస్తుతం చరణ్ సినిమాపై దృష్టి పెట్టారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
1
2
3
4
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!