ప్రముఖ దర్శకుడు శంకర్ ఇటీవల తన పెద్ద కూతురు ఐశ్వర్యను క్రికెటర్ రోహిత్ దామోదరన్ కు ఇచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నెలలో చెన్నైలో వీరి వివాహం జరిగింది. అయితే ఇప్పుడు శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో రోహిత్ తో సహా మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
క్రికెట్ క్లబ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్, సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతడి తండ్రి దామోదరన్, క్రికెట్ కోచ్ తమరాయ్ కన్నన్ లతో పాటు మరో ఇద్దరిపై పుదుచ్చేరిలోని మెట్టుపాళయమ్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులతో కలిసి బాధిత బాలిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన తనను లైంగికంగా వేధించారని సదరు బాధిత బాలిక ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రోహిత్ తో పాటు అతడి తండ్రి, కోచ్ మరో ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తనను వేధించిన విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇచ్చిన మరో ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. అయితే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారా..?లేదా..? అనే విషయం తెలియాల్సివుంది.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!