కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్యర్య వివాహం నేడు తమిళనాడులోని మహాబలిపురంలో ఘనంగా జరిగింది. ప్రముఖ క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఐశ్వర్య కొద్దిసేపటి క్రితం ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించడం విశేషం. ఈ వేడుకకి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెటర్ రోహిత్ తండ్రి రామోదరన్ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అన్న సంగతి తెలిసిందే.
మధురై పాంథర్స్ టీంకు స్పాన్సర్ గా కూడా ఈయన వ్యవహరిస్తుండడం విశేషం.ఇక దర్శకుడు శంకర్ కూతురు ఐశ్యర్య ఓ డాక్టర్ అన్న సంగతి అందరికి తెలిసిందే.అంతేకాదు ఈమెకు ఫ్యాషన్ డిజైనింగ్ పై కూడా ఇంట్రెస్ట్ ఉంది. శంకర్ తెరకెక్కించిన పలు సినిమాలకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ లలో ఒకరుగా వ్యవహరించిన సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు.
శంకర్‌కు ముగ్గురు పిల్లలు. ఒక కొడుకు అర్జిత్ కాగా, ఐశ్వర్య శంకర్, అదితి శంకర్ ఇద్దరు కూతుర్లు. ఇక శంకర్ ‘ఇండియన్ 2’ మూవీకి సంబంధించి లీగల్ ఇష్యూస్ లో ఉండగా..మరోపక్క రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు.