ఫీల్ గుడ్ మూవీ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ టీజర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ శ్రీవాస్

వెండితెరపై ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. లవ్ స్టోరీలు అనేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జానర్లు. యూత్ ఆడియెన్స్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీలను ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ అంటూ రాబోతోన్న ప్రేమ కథ మీద సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ అనే సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ మీద.. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు.

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇదివరకు డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉగాది సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మరో అప్డేట్ గా ఈ మూవీ టీజర్‌ను వదిలింది.

డైరెక్టర్ శ్రీవాస్ రిలీజ్ చేసిన ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్‌లో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జానర్లను చూపించారు. ఇక పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా కలిసి వచ్చేలా ఉన్నాయి.

ఈ టీజర్‌లో సాబు వర్గీస్ ఆర్ఆర్ ఆకట్టుకోగా.. ఎస్ కే రఫి కెమెరాపనితనంతో ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో సహజంగా తీసినట్టు కనిపిస్తోంది. రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి వరికుప్పల యాదగిరి పాటలు రచించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus