Rajamouli: ఈ విషయంలో జక్కన్నను ఎంత మెచ్చుకున్నా తక్కువే.. ఏం చెప్పారంటే?

  • July 5, 2024 / 08:35 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి (S. S. Rajamouli) ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్ లో ఏ సినిమా తెరకెక్కినా ఆ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జక్కన్న సెంటిమెంట్లను ఎక్కువగా పట్టించుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మగధీర (Magadheera) సినిమా ద్వారా తాను చాలా విషయాలు తెలుసుకున్నానని రాజమౌళి పేర్కొన్నారు. తాను లక్ ను ఎప్పుడూ నమ్ముకోనని రాజమౌళి వెల్లడించారు.

నేను సినిమాలో కొంతమంది ఫ్లాప్ హీరోయిన్లను తీసుకుంటే వాళ్లను ఐరన్ లెగ్ అని ఎందుకు అంటారో నాకు అర్థం కాదని జక్కన్న పేర్కొన్నారు. పది ఫ్లాపులు ఇచ్చిన హీరోయిన్ అయినా నా సినిమాకు సరిపోతుందని అనుకుంటే ఆమెనే నేను ఎంపిక చేస్తానని రాజమౌళి వెల్లడించడం గమనార్హం. మగధీర సినిమా తీసే సమయానికి ఆ సినిమాను తెరకెక్కించే సమయంలో చాలా ఎంజాయ్ చేశానని జక్కన్న పేర్కొన్నారు.

మగధీర సినిమాతోనే గ్రాఫిక్స్ విషయంలో నాకు అవగాహన కలిగిందని రాజమౌళి వెల్లడించారు. యమదొంగ (Yamadonga) సినిమాలో తారక్ (Jr NTR) యముడిగా కనిపించిన సన్నివేశాలు అంటే నాకు ఎంతో ఇష్టమని జక్కన్న పేర్కొన్నారు. జక్కన్నను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మహేష్ (Mahesh Babu) రాజమౌళి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో మొదలుకానుందని సమాచారం అందుతోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత సినిమాలతో భారీ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రతి సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ జక్కన్న కాంబో సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus