‘పీపుల్ మీడియా..’ పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!

సీనియర్ స్టార్ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య (V. N. Aditya) అందరికీ సుపరిచితుడే. ‘మనసంతా నువ్వే’ (Manasantha Nuvve) చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ‘శ్రీరామ్’ ‘నేనున్నాను’ (Nenunnanu) ‘బాస్’ (Boss) వంటి చిత్రాలని తెరకెక్కించాడు. ఒకానొక దశలో చిరంజీవితో (Chiranjeevi) కూడా ఈయన సినిమా ఓకే చేయించుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత ఈయన పలు సినిమాలకు దర్శకత్వం వహించారు కానీ అవి చెప్పుకోదగిన సక్సెస్ సాధించలేదు. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా వి.ఎన్.ఆదిత్య డైరెక్షన్ కి దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే లాక్ డౌన్ టైం మళ్ళీ డైరెక్టర్ గా మారి ‘లవ్ @65 ‘ ‘మర్యాద కృష్ణయ్య’ ‘వాళ్ళిద్దరి మధ్య’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ‘పీపుల్ మీడియా సంస్థ’ వీటిని నిర్మించింది. అయితే ఇప్పటికీ ఇవి రిలీజ్ కాలేదు. అయితే ‘పీపుల్ మీడియా’ వారు ఈ ఏడాది తమ బ్యానర్ నుండి వచ్చే నెక్స్ట్ మూవీస్ ఇవే అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేశారు. అందులో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) , ‘విశ్వం’ (Viswam) ‘మా కాళి’, ‘స్వాగ్’ వంటి సినిమాలు ఉన్నాయి.

ఈ పోస్ట్ చూశాక వి.ఎన్.ఆదిత్య కి కోపం వచ్చినట్లు ఉంది. దీంతో ఆయన ఆ పోస్ట్ పై ఈ విధంగా స్పందించారు. “నా మూడు సెన్సిబుల్, విలువైన సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాను, మీ కంపెనీ పెద్దలు నా సినిమాల విడుదల గురించి అర క్షణం ఆలోచిస్తే సరిపోతుంది.

నేను సహనం కోల్పోయా. అందుకే ఇలా అడగాల్సి వస్తోంది” అంటూ ఫేస్‌బుక్ లో స్పందించారు. ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. కానీ ఇంతలో ఏమైందో ఏమో..కానీ ఇప్పుడు ఆ పోస్ట్ ను ఆయన డిలీట్ చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus