Nandamuri Mokshagna: ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి మోక్షజ్ఞకు నటుడిగా మంచి గుర్తింపు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి చాలా సందర్భాల్లో వార్తలు వినిపించాయి. అయితే అధికారికంగా మోక్షజ్ఞ మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఎప్పుడూ వెల్లడించలేదు. నందమూరి మోక్షజ్ఞ తాజాగా తన ప్రొఫైట్ ఫోటోను మార్చేశారు. కొత్త లుక్ లో మోక్షజ్ఞ సూపర్ అనేలా ఉన్నారనే చెప్పాలి. మోక్షజ్ఞ ఎక్స్ లో “వస్తున్నా.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి” అని పేర్కొన్నారు.

మోక్షజ్ఞ సోలోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? లేక అఖండ2 (Akhanda 2) సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో మోక్షజ్ఞ ఎంట్రీకి ఇదే సరైన సమయమని బాలయ్య (Balakrishna) భావిస్తున్నట్టు తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీ మరింత ఆలస్యమైతే ఫ్యాన్స్ సైతం ఫీలయ్యే ఆవకాశాలు అయితే ఉంటాయి. మోక్షజ్ఞ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో మోక్షజ్ఞ నటిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. బాలయ్య అడిగితే నో చెప్పే దర్శకుడు అయితే ఉండరని చెప్పవచ్చు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.

మోక్షజ్ఞ తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. త్వరలో మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus