Double Ismart First Single: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

రామ్ పోతినేని (Ram) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’  (iSmart Shankar) మూవీ వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. మాస్ ఆడియన్స్ ఆ మూవీని బాగా ఆదరించారు. రామ్ పోతినేని మార్కెట్ ను కూడా డబుల్ చేసిన సినిమా ఇది. అంతేకాదు వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్.. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు కావడంతో, ఆయనకు అప్పటివరకు ఉన్న అప్పులు అన్నీ తీరిపోయాయి అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు.

మొత్తానికి ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) పేరుతో అది పట్టాలెక్కడం.. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరు మొదలు పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో ‘డబుల్ ఇస్మార్ట్’ నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ (Mani Sharma) అందించిన ట్యూన్.. ‘ఇస్మార్ట్ శంకర్’ లోని ‘ఇస్ ఇస్ ఇస్మార్టే’ పాటని గుర్తు చేసింది అని చెప్పాలి. ‘ఇస్మార్టు శంకరే.. ఏక్ దమ్ డేంజరె.. ఔర్ ఏక్ బార్ ఆయారే .. బేజారె’ అంటూ అనురాగ్ కులకర్ణి, సాహితీ ఎంతో జోష్ తో ఈ పాటని పాడారు.

మధ్య మధ్యలో పూరి స్టైల్లో కేకలు అనేవి అదనంగా చెప్పుకోవచ్చు.పూరీ ఆస్థాన రైటర్ అయినటువంటి భాస్కర్ బట్ల ఈ పాటకు లిరిక్స్ అందించారు. సాంగ్ అయితే సో సో గానే ఉంది. కానీ రామ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వల్ల లిరికల్ సాంగ్ హైలెట్ అయ్యింది అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus