బన్నీ చిత్రం కోసం సుకుమార్ ఫుల్ బిజీ

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. పూజా హెగ్దే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈమద్యే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ కు కూడా ఏమాత్రం డోకా ఉండదట. శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ చిత్రం తరువాత బన్నీ సుకుమార్ తో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ 20 వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పనుల్లో సుకుమార్ బిజీగా గడుపుతున్నాడట.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి తిరుమల అడవుల్లో చిత్రీకరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సుకుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. సాధారణంగా క్వాలిటీ విషయంలోనూ.. లాజిక్స్ విషయంలోనూ సుకుమార్ అస్సలు కంప్రమైజ్ అవ్వడనేది అందరికీ తెలిసిన సంగతే. ఇక ఈ చిత్రాన్ని మే 11న ( ఈ నెల) లాంచ్ చేయబోతున్నారు. ఇక అదే రోజున ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తివివరాలు ప్రకటిస్తారని కూడా టాక్ నడుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus