Sukumar: మీరిద్దరూ నా హీరోలు…వేడుక జరుపుకునే క్షణం ఇది!

  • January 11, 2023 / 07:10 PM IST

దర్శక దీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నఎస్ ఎస్ రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎలాంటి క్రేజ్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే అనంతరం ఈ సినిమాకు మించి RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరింత ఆదరణ పొందింది. ఇక ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.

ఇక దర్శకుడిగా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ నుంచి ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి అవార్డును కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సైతం ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేశారు.

న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్‌ అవార్డ్స్‌ 2022 లో ఉత్తమ దర్శకుడిగా జక్కన్న అవార్డు అందుకున్న సమయంలో వేదికపై రాజమౌళి మాట్లాడుతున్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సుకుమార్ రాజమౌళి మై హీరో అంటూ లవ్ సింబల్ తో షేర్ చేశారు అయితే ఈ పోస్ట్ పై మరొక డైరెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా సుకుమార్ చేసిన పోస్ట్ పై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందిస్తూ…

మీరిద్దరూ నా హీరోలు మీరే నాకు స్ఫూర్తి ప్రస్తుతం మనమందరం వేడుక జరుపుకునే క్షణం అంటూ కామెంట్ చేశారు.ఇక డైరెక్టర్ సందీప్ రాజ్ లవ్ సింబల్స్ తో కామెంట్ చేశారు మొత్తానికి సుకుమార్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus