ప్రభాస్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్.!

క్లాస్ ఆడియన్స్ తో అభినందనలు అందుకోవడమే కాదు..  మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించడం కూడా వచ్చని సుకుమార్ రంగస్థలం సినిమాతో నిరూపించారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని సెంటర్లలో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరి దీని తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సుకుమార్ నెక్స్ట్ హీరో అల్లు అర్జున్ అని కొంతమంది, చిరంజీవి అని కొంతమంది చెప్పొకొచ్చారు. వారు వీరు చెప్పేది ఏముంది.. సుకుమార్ మనసులో ఏముందో అడిగేస్తే పోలా.. అనుకున్నారు మీడియా మిత్రులు. వారు అడగకముందే రంగస్థలం సక్సస్ మీట్ లో సుకుమార్ కోరికను బయటపెట్టారు. తనకి ప్రభాస్ తో  సినిమాని తీయాలను ఉందని అందరి ముందు చెప్పారు. మీడియాతో చెప్పేవరకు వచ్చిందంటే… వెనకాల ఇంకెంత కథ నడిచిందో.. అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.

రంగస్థలం రిలీజ్ కి ముందే ప్రభాస్ ని కలిసి సుకుమార్ స్టోరీ చెప్పారంట. కథకి ప్రభాస్ ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని తెలిసింది. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. అబుదాబి రోడ్లపై భారీ ఛేజింగ్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నారు. కృష్ణం రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత ప్రభాస్.. సుకుమార్ ప్రాజక్ట్ ని పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ భారీ నిర్మాణ సంస్థ రెడీగా ఉందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus