సినిమా అంటేనే పిచ్చి…అయితే అదేంటో తెలీదు కానీ…సినిమా విషయంలో కొంతమంది తమను తాము మరచిపోయి మరీ కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు…అయితే అలాంటి నిర్ణయాలు, రిస్క్ తో కూడిన పనులు కొన్ని సార్లు సక్సెస్ ను అందిస్తాయి కానీ…కొన్ని సార్లు పాతాలానికి తొక్కి వేస్తాయి…ఇంతకీ విషయం ఏమిటంటే….ప్రిన్స్ మహేష్ తో ఒక సినిమా చెయ్యాలి అని అనుకున్నాడు తమిళ దర్శకుడు సుందర్….అయితే డేట్స్ ఖాళీ లేక మహేష్ ఒప్పుకోలేదో….
మరి ఇతరత్రా కారణాల వల్ల ఒప్పుకోలేదో తెలీదు కానీ….మొత్తానికి నో చెప్పాడు…అయితే మహేష్ తిరస్కరణను కాస్త పర్సనల్ గా తీసుకున్న ఆ దర్శకుడు…సినిమాను జయం రవితో కానిచ్చేస్తున్నాడు. అయితే మహేష్ అనుకున్న పాత్రకు ఆర్యను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సినిమా టైటిల్ కూడా ‘సంఘమిత్ర’ అని పెట్టారట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ…ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబడుతూ…ఆ దర్శకుడి డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పుకొచ్చాడు. తెలుగు తమిళ భాషల్లో స్టార్స్ తో సినిమా తీస్తే ఇదో పెద్ద భారీ బడ్జెట్ సినిమా అవుతుందని భావించి ముందు ఇక్కడ స్టార్స్ ను కలిశాడు కాని ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చిన్నగా ఇద్దరు తమిళ హీరోలతోనే సినిమా స్టార్ట్ చేయాలని ఆ దర్శకుడు ఫిక్స్ అయిపోయాడట…
ఐడియా బాగానే ఉంది కానీ…బాహుబలి రేంజ్ హిట్ కొట్టి చూపించాలని ప్రయత్నం చేయడం కూడా సబబె కానీ…ఈ సినిమా పాత్రల్లో ఆర్య అయితే ఓకే కాని జయం రవి సినిమాలేవి ఇక్కడ అంత మంచి మార్కెట్ లేవు ఆర్య కూడా ఓపెనింగ్స్ వరకు ఓకే కాని సినిమాలో విషయం లేకపోతే తర్వాత రోజే తీయాల్సిందే. మరి ప్రిన్స్ పై కోపంతో ఆ దర్శకుడు చేస్తున్న రిస్క్ ఎంతవరకూ ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.