చనిపోయేలోపు ఉదయ్‌ విషయం బయటపెడతా!

యువ కథానాయకుడు ఉదయ్‌ కిరణ్‌ మృతి వెనుక ఏమైనా మిస్టరీ ఉందా? చాలా రోజులుగా ఈ డౌట్‌ చాలామందికి ఉంది. ఉదయ్‌ చనిపోయిన తొలి రోజుల్లో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. అయితే ఆ తర్వాత పెద్దగా ఎవరూ దీని గురించి మాట్లాడుకోలేదు. ఏటా ఆయన వర్ధంతి, జయంతి సందర్భాల్లో ఈ విషయాలు చర్చలోకి వస్తాయి. అయితే దర్శకుడు తేజ ఈ విషయం గురించి మాట్లాడారు. అంతేకాదు ఉదయ్‌ కిరణ్‌ మృతికి సంబంధించిన విషయాల్ని తాను చనిపోయేలోపు బయటపెడతా అని కూడా అన్నారు.

ఉదయ్‌ కిరణ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ జరిగింది తేజ దర్శకత్వంలోనే అనే విషయం తెలిసిందే. ‘చిత్రం’, ‘నువ్వు నేను’ అంటూ ఉదయ్‌ కెరీర్‌ను అంత ఎత్తున ఉంచారు దర్శకుడు తేజ. అప్పట్లో ఉదయ్‌కి లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అలాంటి ఉదయ్‌ వరుసగా ఫ్లాప్స్‌ రావడంతో కుంగిపోయాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఉదయ్ ఆత్మహత్యపై చాలా రకాల కామెంట్స్ వినిపించాయి.

కొత్త అవకాశాలు రాకపోవడం కారణమని కొందరు, ఉదయ్ ఆత్మహత్య వెనుక పెద్దల హస్తం ఉందని మరికొందరు, భార్యతో విభేదాల వల్లే ఇలా చేశాడని ఇంకొందరు అన్నారు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియరాలేదు. అయితే ఉదయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తనకు తెలుసనని తేజ చేసిన వైరల్ గా మారాయి. ఉదయ్ కిరణ్‌ చనిపోయే ముందు తనకు ఫోన్ చేశాడని, జరిగిందంతా చెప్పాడని దర్శకుడు తేజ అన్నారు.

అలా ఆ ఆత్మహత్యకు కారణాలు తనకు పూర్తిగా తెలుసని చెప్పారు. అయితే అవన్నీ ఇప్పుడు బయటపెట్టనని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానని తేజ అన్నారు. తాను చనిపోయేలోపు ఉదయ్ ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తానని చెప్పారు తేజ. తేజ వ్యాఖ్యల విషయంలో ఇండస్ట్రీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ వ్యవహారంలో అప్పట్లో పోలీసులు కాస్త విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఎలాంటి వివరాలు లేవు. ఇప్పుడు తేజ వ్యాఖ్యల విషయంలో మళ్లీ విచారణ ఏమైనా ఉంటుంది అనేది చూడాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus