“ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమా నుంచి తప్పుకొన్న తర్వాత ఇప్పటివరకు దర్శకుడు తేజా ఈ సినిమాపై కానీ. రిజల్ట్ పై కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ.. మొట్టమొదటిసారిగా ఆయన సినిమా తీసిన విధానం గురించి, సక్సెస్ గురించి స్పందించాడు. “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాలో ముఖ్యంగా మిస్ అయ్యింది డ్రామా, ఆ డ్రామాను సరిగా తెరకెక్కించాలంటే బుర్ర ఉండాలి” అన్నాడట తేజ. ఈ విషయం జరిగింది ఇన్సైడ్ అయినప్పటికీ.. ఆ విషయం బయటకి వచ్చింది.
నిజానికి.. క్రిష్ టీం లోకి రావడానికి కారణం కూడా బాలయ్యకు, తేజకు నడుమ క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడమే. సినిమా ఫ్లాప్ అవ్వడంతో తేజ ఇప్పటికీ తన అక్కసు వెళ్లగక్కుకున్నాడు. మరి ఈ విషయమై బాలయ్య స్పందిస్తాడో లేదో చూడాలి. క్రిష్ మాత్రం తనపై అటు బాలీవుడ్ నుంచి కంగనా, టాలీవుడ్ లో తేజ ఇలా వరుసబెట్టి దాడి చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక ఇబ్బందిపడుతున్నాడు క్రిష్. ఇకపోతే.. ఫిబ్రవరి 14న విడుదల ప్రకటించిన ఎన్టీఆర్ మహానాయకుడు అదే తేదీన విడుదలవుతుందా లేదా అనే డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. అందుకు కారణం షూటింగ్ ఇంకా పూర్తవ్వకపోవడమే