వంద చిత్రాల తర్వాత నటసింహ బాలకృష్ణ ఆలోచనలో మార్పు వచ్చింది. క్రేజీ కాంబినేషన్స్ కి ఆయన ఒకే చెబుతున్నారు. యువ డైరక్టర్ లతో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ చేసిన బాలయ్య ఇప్పుడు కెఎస్ రవికుమార్ తో ఫ్యాక్షన్ స్టోరీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో మూవీని సెట్ చేస్తున్నారు. తేజ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాను విభిన్నంగా తెరకెక్కించి హిట్ అందుకున్నారు.
ఈ సినిమాని రీసెంట్ గా చూసిన బాలకృష్ణకు డైరక్టర్ టేకింగ్ భలే నచ్చింది. అందుకే అతనికి కాల్ చేసినట్లు తెలిసింది. తన కోసం కథ ఉంటే తీసుకురమ్మని, నచ్చితే వెంటనే చేద్దామని చెప్పిన్నట్లు ఫిలిం నగర్ వాసులు వెల్లడించారు. బాలయ్యతో సినిమాకి తేజ ఆసక్తి కనబరిస్తే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని అతని చేతిలో పెట్టాలనే ఆలోచన కూడా ఉందంట. మరి బాలయ్యతో సినిమాకి తేజ ఒకే అంటారా? లేక యువ హీరోలతోనే నడుస్తారా అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.