Teja, Rana: ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో రిపీట్!

Advertisement

నటుడు రానా సోలోగా హిట్టు కొట్టిన సినిమాల్లో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ముందు వరసలో ఉంటుంది. దర్శకుడు తేజకి ఇది కమ్ బ్యాక్ ఫిలిం. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. రానా చివరిగా ‘విరాటపర్వం’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ సినిమాను మొదలుపెడతారని వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు.

ప్రస్తుతం రానా కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. నెట్ ఫ్లిక్స్ కోసం ఆయన చేసిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. దర్శకుడు తేజతో కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నారు రానా. ఇటీవల రానాని కలిసి తేజ ఓ కథ చెప్పారట. రానాకి నచ్చడంతో కథ సురేష్ బాబు వరకు వెళ్లింది. ఆయన కూడా ఓకే చేయడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయినట్లేనని చెబుతున్నారు.

ఇదివరకు రానా కోసం ‘రాక్షస రాజు రావణాసురుడు’ అనే టైటిల్ తో సినిమా చేయాలనుకున్నారు తేజ. అది కూడా సురేష్ ప్రొడక్షన్స్ లోనే. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టి వేరే కథతో సినిమా చేయబోతున్నారు తేజ. దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు తేజ. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రానా ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus