బాహుబలి సిరీస్ సినిమాలతో దర్శకధీరుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని భావించే నటీనటులు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అయితే ఒక డైరెక్టర్ మాత్రం తాను రాజమౌళిని పొట్టోడు అని పిలిచేవాడని రాజమౌళి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి దర్శకుడు రాఘవేంద్రరావు శిష్యుడనే సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి రాఘవేంద్రరావు కంటే ముందు క్రాంతి కుమార్ అనే డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
అయితే క్రాంతి కుమార్ దగ్గర రాజమౌళితో పాటు దిక్కులు చూడకు రామయ్య సినిమాకు దర్శకత్వం వహించిన త్రికోటి కూడా పని చేశారు. ఒక ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ తాను, త్రికోటి శీష్ మహల్ థియేటర్ లో పాత సినిమాలను చూడటానికి వెళ్లేవాళ్లమని తెలిపారు. సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేవాళ్లమని ఆ సమయంలో త్రికోటి తనను పొట్టోడు అని పిలిచేవాడని రాజమౌళి వెల్లడించారు. త్రికోటి హైట్, తన హైట్ ఒకటే కావడంతో ఒకసారి ఎందుకు పొట్టోడా అని పిలుస్తారని తాను అడిగానని ఆయన పొట్టోడా అంటే చిన్నోడా అని అర్థమని చెప్పుకొచ్చారు.
రాజమౌళి దర్శకుడిగా మారిన తర్వాత త్రికోటిని అసిస్టెంట్ గా చేర్చుకున్నారు. ప్రస్తుతం రాజమౌళిని సార్ అని పిలిచే త్రికోటి ఎవరూ లేకపోతే మాత్రం రాజమౌళిని మౌళి అని పిలుస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం త్రికోటి రాజమౌళి దగ్గర పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పనులతో బిజీగా ఉన్న రాజమౌళి అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!