ఆ వార్తలను ఖండించిన వి.ఎన్.ఆదిత్య
- June 22, 2016 / 10:20 AM ISTByFilmy Focus
దర్శకుడిగా “మానసంతా నువ్వే” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కలిగిన వి.ఎన్.ఆదిత్య ప్రస్తుతం సినిమాల్లేక ఖాళీగా ఉన్నాడు. మీడియాతోపాటు జనాలు కూడా ఇతగాడ్ని దాదాపుగా మర్చిపోయారు. కానీ.. ఉన్నట్లుండి ఆదిత్య ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించాడు.
అయితే.. అందుకు కారణం వేరే. గత ఆరు నెలలుగా అమెరికాలో ఉంటున్న వి.ఎఎన్.ఆదిత్య తన కుటుంబాన్ని వదిలేశాడని, అతడి భార్య ప్రస్తుతం ఒక స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోందని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయమై స్పందించిన వి.ఎఎన్.ఆదిత్య సదరు వార్త ప్రచురించిన సంస్థనే కాక రాసిన పాత్రికేయుడిపైనా నిప్పులు కక్కాడు. తాను ఓ స్క్రిప్ట్ పని మీద అమెరికాలో ఉంటున్నానని, త్వరలోనే తిరిగి ఇండియా వచ్చేస్తానని స్పష్టం చేశాడు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











