Vasishta: ఆ టాలీవుడ్ హీరో అంటే ఇష్టమంటున్న వశిష్ట!

  • August 8, 2022 / 06:37 PM IST

బింబిసార సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ కావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్టపై కూడా నందమూరి అభిమానుల్లో అభిమానం పెరిగింది. దర్శకుడు వశిష్ట ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బింబిసార పార్ట్2 అయితే కచ్చితంగా ఉంటుందని అన్నారు. బింబిసార2 తర్వాత బింబిసార3 దిశగా అడుగులు పడతాయో లేదో చెప్పలేనని వశిష్ట వెల్లడించారు. బింబిసార2 లో బాలయ్య కనిపిస్తారని జరిగిన ప్రచారంలో నిజం లేదని వశిష్ట చెప్పుకొచ్చారు.

నేను బేసికల్ గా బాలకృష్ణ గారి ఫ్యాన్ అని వశిష్ట కామెంట్లు చేశారు. బాలయ్య బాబును ఇప్పటివరకు నేను కలవలేదని వశిష్ట చెప్పుకొచ్చారు. ఫ్యాన్ గా బాలయ్య కూడా బింబిసార2 లో నటిస్తే బాగుంటుందని నాకు కూడా ఉంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ అని తనతో చెప్పారని వశిష్ట కామెంట్లు చేశారు.

రవితేజకు కాకుండా ఎవరికీ కథలు చెప్పలేదని వశిష్ట తెలిపారు. ఆడియన్స్ ఆలోచన మారిపోయిందని ట్రెండ్ ను బట్టి ముందుకెళ్లాల్సి ఉంటుందని వశిష్ట చెప్పుకొచ్చారు. బింబిసార2 కూడా సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోల సినిమాలకు పని చేసే ఛాన్స్ వశిష్టకు దక్కుతుందని చెప్పవచ్చు. బింబిసార1 సక్సెస్ తో వశిష్ట రెమ్యునరేషన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండటం గమనార్హం. చాలామంది హీరోలు తమ సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేక ఇబ్బంది పడుతుంటే కళ్యాణ్ రామ్ మాత్రం తన సినిమాతో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus