గత కొంతకాలంగా అమలపాల్ కు తన భర్త విజయ్ కు మధ్య అపార్ధాలు చోటుచేసుకున్నాయని అవి కాస్త విడాకులు తీసుకునే వరకు వెళ్ళిందనే మాటలు వినిపించాయి. వివాహం తరువాత సినిమాలు చేయనని చెప్పిన అమల దానికి విరుద్దంగా సినిమాలు చేయడంతో తన అత్తమామలకు ఆ విషయం నచ్చక ఆగ్రహించడంతో అమల విడాకులు తీసుకుంటుందని టాక్.
అయితే తాజాగా ఈ విషయాలపై అమలపాల్ భర్త విజయ్ స్పందించాడు. నా తల్లితండ్రులు అమలను సినిమాలు మానేయమని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు అలాంటివాళ్లు కాదు. అసలు మేము విడిపోవడానికి కారణం సినిమాలు కాదు ఆ కారణం ఏంటో నాకే తెలుసు. మా వివాహబందం ఇలా మధ్యలోనే విడిపోతుందని అనుకోలేదు. నమ్మకం, నిజాయితీ లేనప్పుడు సంసార జీవితాన్ని కొనసాగించడంలో అర్ధం లేదని ఆయన పేర్కొన్నారు.