Sita Ramam: ఆ నిజాయితీ నన్ను ఇంప్రెస్ చేసింది: వివేక్ అగ్నిహోత్రి

  • September 20, 2022 / 02:29 PM IST

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన తాజా చిత్రం సీతారామం. అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా యుద్ధంతో కూడుకున్న ప్రేమ కథ అనే టాగ్ లైన్ తో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్ ,హిందీ వంటి అన్ని భాషలలో కూడా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయంతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగిందని చెప్పటంలో సందేహం లేదు.

కొంత కాలం క్రితం వరకు ఇండస్ట్రీలో బాలీవుడ్ సినిమాల డామినేషన్ ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారు అయ్యింది. గతంలో టాలీవుడ్ నుండి హీరో హీరోయిన్లు బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరో హీరోయిన్లు టాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల విడుదలైన సీతారామం సినిమా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ స్థాయిలో వసూలు చేసింది.

దీంతో ఈ సినిమా గురించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రశంసలు కురిపించాడు. ఇటీవలే ది కశ్మీర్ ఫైల్స్ సినీమాతో ప్రపంచాన్ని షేక్ చేసిన వివేక్ అగ్నిహోత్రి తాజాగా సీతారామం సినిమాని చూసినట్టు సోషల్ మీడియాలో లో వెల్లడించాడు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి, నటీనటుల పై ప్రశంశలు కురిపించాడు. ఈ మేరకు.. దుల్కర్ నటన ఎంతో ఫ్రెష్ గా ఉందని, అతనిలోని నిజాయితీ నన్ను ఇంప్రెస్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ.. మృణాల్ నటన గురించి ఏం చెప్పను.. ఆమె నటనను మొదటిసారిగా చూసాను.. ఎంతో ఫ్రెష్ గా, ఒరిజినల్ గా అనిపించింది. త్వరలోనే ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది అంటూ కంగ్రాట్స్ చెప్పుకొచ్చాడు. అయితే బాలీవుడ్ స్టార్ దర్శకుడు తెలుగు సినిమా గురించి ఇలా ప్రశంసించడంతో సినిమా యూనిట్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus