సాధారణంగా తమ సినిమాల రిలీజ్ కోసం తెగ కష్టపడుతుంటారు దర్శకులు. కానీ ఇప్పుడు ఓ తమిళ దర్శకుడు తన సొంత రిలీజ్ ను అడ్డుకోవడం హాట్ టాపిక్ గా మారింది. శింబు, హన్సిక జంటగా దర్శకుడు జమీల్ ‘మహా’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి రెండేళ్లు దాటిపోయింది. ఫైనల్ గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటూ దర్శకుడు కోర్టులో కేసు పెట్టాడు.
తన దృష్టికి తీసుకురాకుండా సినిమాను రిలీజ్ చేస్తున్నారని.. షూటింగ్ లో మిగిలిన భాగాన్ని తన అసిస్టెంట్ డైరెక్టర్ తో పూర్తి చేయించారనేది ప్రధాన అభియోగం. పైగా అందులో కథకు తగ్గ సన్నివేశాలు లేవని చెప్పారు. అంతేకాకుండా.. తన ప్రమేయం లేకుండా ఎడిటింగ్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ పూర్తి చేశారని చెప్పారు. ఇలాంటి పనులు చేయడంతో పాటు తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా ఎగ్గొట్టారని ఆరోపించారు. ముందుగా రూ.24 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని..
కానీ తనకు రూ.8 లక్షల 15 వేలు మాత్రమే చెల్లించారని స్పష్టం చేశారు. ఇప్పుడు మిగిలిన రెమ్యునరేషన్ పాటు.. తనను మోసం చేసినందుకు అదనంగా రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. జమీల్ పిటిషన్ యాక్సెప్ట్ చేసిన కోర్టు ఈ విషయంలో నిర్మాతలను, అసిస్టెంట్ డైరెక్టర్ అంజు విజయ్ ను మే 19 లోపు వివరణ ఇవ్వాలని సూచించారు.