Samantha: గాయాలై రక్తం కారుతున్నా సమంత అలా చేశారా?

  • November 22, 2021 / 07:21 PM IST

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఈ ఏడాది ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ ద్వారా సమంత పాపులారిటీని మరింత పెంచుకున్నారు. కథ నచ్చితే బోల్డ్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధమేనని సమంత చెప్పకనే చెప్పేశారు. తాజాగా ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లో సమంతను ఎంపిక చేయడం గురించి రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లోని రాజీ పాత్రకు తమిళం తెలిసిన నటి కావాలని

తమిళంలో హిట్ గా నిలిచిన సూపర్ డీలక్స్ ను చూసి సమంతను ఫ్యామిలీ మేన్2 ఎంపిక చేశామని రాజ్ అండ్ డీకే చెప్పుకొచ్చారు. అయితే సమంత రాజీ పాత్రకు అంచనాలను మించి న్యాయం చేశారని రాజ్ అండ్ డీకే తెలిపారు. రాజీ పాత్రను సమంత పూర్తిస్థాయిలో మనస్సులోకి ఎక్కించుకొని చేశారని రాజ్ అండ్ డీకే చెప్పుకొచ్చారు. రాజీ పాత్ర భావోద్వేగాలలో జీవిస్తూ సమంత వెక్కివెక్కి ఏడ్చిన ఘటనలు కూడా ఉన్నాయని రాజ్ అండ్ డీకే అన్నారు.

ఆ పాత్రను పోషించే సమయంలో సమంత చేతులకు గాయమై రక్తం వచ్చిందని సమంత మాత్రం డూప్ లు లేకుండా ఫైట్లు చేసి ఆశ్చర్యపోయేలా చేశారని రాజ్ అండ్ డీకే పేర్కొన్నారు. ఫ్యామిలీ మేన్3 స్క్రిప్ట్ పనులు పూర్తి కాలేదని ఫ్యామిలీ మేన్2లో మనోజ్ భాజ్ పాయ్ పాత్రను మొదట బెంగాళీ పాత్రగా రాసుకున్నామని ఆ తర్వాత మరాఠీ పాత్రగా మార్చామని రాజ్ అండ్ డీకే పేర్కొన్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus