కన్నడ తో పాటు టాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందన. వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక ను గోల్డెన్ లెగ్ గా భావిస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ‘పుష్ప’ ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్లో కూడా అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తుంది. అయితే రష్మిక కు బాలీవుడ్లో అవకాశం రావడానికి ఆమె చేసిన హిట్టు సినిమాలు కారణం కాదట.
ఓ డిజాస్టర్ సినిమా కారణమట..! అది మరేదో కాదు.. విజయ్ దేవరకొండ- రష్మిక హీరో, హీరోయిన్లుగా భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ..! ఈ చిత్రంలో బాబీ- లిల్లీ అనే పాత్రల్లో రష్మిక,విజయ్ లు కనిపించారు. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ పాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్లో..! అందుకే ‘మిషన్ మజ్ను’ దర్శకుడు అయిన శాంతను బాగ్చి.. రష్మిక ను ఏరి కోరి ఎంపిక చేసుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
‘సినిమాలో హీరోయిన్ మొదట అమాయకంగా కనిపించాలి.. అటు తరువాత వేరియేషన్ మార్చి ప్రవర్తించాలి. ‘డియర్ కామ్రేడ్’ లో రష్మిక పెర్ఫార్మన్స్ అలాగే ఉంటుంది. అందుకే ఆమె మాత్రమే నా పాత్రకు న్యాయం చేయగలదని భావించి నేను ఆమెను అప్రోచ్ అయ్యాను’ అంటూ అతను చెప్పుకొచ్చాడు.