ఈమధ్యకాలంలో కథానాయికలను కేవలం పాటలకు, హీరోతో రొమాన్స్ కు పరిమితం చేసేస్తుండడం వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోయింది కానీ.. ఇంతకుమునుపు కథానాయికలకు కూడా కథానాయకుడితో సమానమైన క్రేజ్ ఉండేది. హీరోయిన్ ఎవరు అనే విషయం మీద బిజినెస్ ఒక్కోసారి ఎక్కువగా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. శ్రీదేవి, సౌందర్య, విజయశాంతిల స్టార్ డమ్ అందుకు నిదర్శనం. కానీ.. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ రోల్ అంటే చారులో కార్వేపాకులా తయారయ్యింది. ప్రాముఖ్యత పక్కన పెడితే కనీసం కథలో కూడా భాగస్వాములు కాలేకపోతున్నారు.
అందుకు “బాహుబలి” కథానాయిక తమన్నా కూడా మినహాయింపేమీ కాదు. “బాహుబలి” అనంతరం తమన్నా ఖాతాలో ఒక్క హిట్ కూడా లేకపోవడంతో ఆమె మార్కెట్ అంతకంతకూ తగ్గుతూ వచ్చింది. ఆ కారణంగా తమన్నా కథానాయికగా హిందీ-తెలుగు భాషల్లో రూపొందిన ఓ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఆ సినిమా కొనడానికి కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ముందుకు రాలేదట. దాంతో తమన్నా ఉంది కాబట్టి తెలుగులోనూ గట్టిగా మార్కెట్ చేసుకోవచ్చని భావించిన దర్శకుడు కునాల్ కోహ్లీ ప్రస్తుతం ఏం చేయాలో తెలియక బాధపడుతున్నాడట.