బిగ్ బాస్ హౌస్ నుండి మూడో కంటెస్టెంట్ గా దేవి నాగవల్లి ఎలిమినేటై వెళ్లిపోయారు. ఎలిమినేషన్ కి ఎంపికైన ఏడుగురు సభ్యులలో లాస్య, మోనాల్ గజ్జర్, మెహబూబ్, హారిక, ఆరియానా సేవ్ కాగా చివరి వరకు కుమార్ సాయి, దేవి నాగవల్లిలో ఎవరు హౌస్ నుండి వెళ్లిపోనున్నారనే ఉత్కంఠ కొనసాగింది. చివరికి దేవి నాగవల్లి ఎలిమినేట్ అయినట్లు కింగ్ నాగార్జున ప్రకటించారు. దేవి నాగవల్లి ఎలిమినేషన్ పై అనేక అనుమానాలు వెలువడ్డాయి.
అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ దేవి ఎలిమినేట్ కావడం ఏమిటని అందరూ అనుకున్నారు. ఎలిమినేషన్ లో ఉన్న వాళ్లందరిలో దేవి నాగవల్లి బాగా తెలిసిన పేస్. అలాగే బిగ్ బాస్ లో ఆమె గేమ్ కూడా బాగానే ఉంది. ఏదిఏమైనా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా దేవి నాగవల్లి ఎలిమినేటైనట్లు నాగార్జున చెప్పడం జరిగింది. దేవి నాగవల్లి ఇంటి నుండి వెళ్లిపోతుందని తెలిశాక ఆరియానా చాలా ఎమోషనల్ అయ్యింది. దేవిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. దేవి హౌస్ నుండి వెళ్లిపోవడం ఆరియానాను బాగా వేదన గురి చేసినట్లు అర్థం అయ్యింది.
దేవి ఎలిమినేషన్ పట్ల ఆరియానా స్పందించిన తీరుకు దేవికి ఆమె ఆ కొద్ది సమయంలోనే బాగా దగ్గరయ్యింది. ఆ ఎఫెక్ట్ ఒకవారం ఆరియానా ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి హెల్ప్ అయ్యింది. పాజిటివ్ బిగ్ బాంబ్ తీసుకున్న నాగవల్లి ఆరియానా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లో లేకుండా చేసింది. ముందుగానే ఇదంతా పసిగట్టిన ఆరియనా అంత ఎమోషనల్ అయ్యిందా అనే అనుమానం అందరిలో మొదలైంది.