Prabhas: ప్రభాస్ ఇన్ స్టాలో ఎవరిని ఫాలో అవుతున్నారో తెలుసా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఈయన బాహుబలి సినిమా తర్వాత తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి.ఇలా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక ఈయనకు సోషల్ మీడియాలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారనే చెప్పాలి. ఇకపోతే ప్రభాస్ ఇతర హీరోల మాదిరిగా సోషల్ మీడియాలో చాలా తక్కువగా సందడి చేస్తూ ఉంటారు. కేవలం ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర హీరోల సినిమాలు విడుదల అయితే తప్ప సోషల్ మీడియాలో స్పందించరు. ఇక ఈయనకు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 9.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఇంస్టాగ్రామ్ లో ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఈయన మాత్రం చాలా తక్కువ మందిని ఫాలో అవుతున్నారు.

ప్రభాస్ (Prabhas) ఇన్స్టాగ్రామ్ లో కేవలం 15 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. మరి ఈయన ఫాలో అవుతున్న ఆ 15 మంది ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…పెద్దనాన్న దివంగత హీరో కృష్ణంరాజు. డైరెక్టర్ సందీప్ వంగా. అలాగే ఆదిపురుష్ ఫేమ్ సన్నీ సింగ్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, డైరెక్టర్ రాధాకృష్ణ, శ్రుతి హాసన్, అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ ఓంరౌత్, దీపికా పదుకొణే, నటి భాగ్య శ్రీ, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్, సాహో డైరెక్టర్ సుజిత్ ఉన్నారు.

ఈ విధంగా ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారిలో ఎక్కువగా ఆయన సినిమాలు చేస్తున్నటువంటి వారు మాత్రమే ఉన్నారు. ఇక ఈయన ఫాలో అయ్యే వారిలో ఒక తెలుగు సెలబ్రిటీ కూడా లేకపోవడం గమనార్హం.ఇక ఈయన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమందితో చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ తెలుగు సెలబ్రిటీలను ప్రభాస్ ఫాలో కాకపోవడం గమనార్హం.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus