బుల్లితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తేజస్విని ఒకరు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు కన్నడ తమిళ భాష సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈమె సీరియల్ నటిగా కొనసాగుతూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క బుల్లితెర ఆర్టిస్టులు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
ఇటీవల వారు యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారనే విషయాలను కూడా బహిరంగంగా తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అమర్ భార్య కూడా తేజస్విని గౌడ కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈమె తనకు సంబంధించి ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో కాస్త వీడియోలను షేర్ చేయడం తగ్గించినప్పటికీ ఈమె షేర్ చేసే వీడియోలకు మాత్రం భారీ స్థాయిలో వ్యూస్ వస్తూ ఉంటాయి.
ఇక ఈమెకు యూట్యూబ్ ఛానల్ లో ఏకంగా 16 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈమె వీడియోలకు భారీ స్థాయిలో వ్యూస్ రావడంతో నెలకు 30 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారని తెలుస్తుంది. ఇలా నెలకు 30 లక్షల రూపాయల ఆదాయం అంటే సుమారు సంవత్సరానికి మూడు కోట్ల వరకు ఆదాయం పొందుతున్నారు.
ఈమె (Tejaswini) సంపాదించే ఈ డబ్బుతో మీడియం రేంజ్ హీరోలతో ఒక సినిమా చేయవచ్చు అంటూ కొందరు యూట్యూబ్ సంపాదన పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా సెలబ్రిటీలందరూ కూడా లక్షల్లో ఆదాయం పొందడంతో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వారికి సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.