Honey Rose Age: హనీ రోజ్ బ్యూటీ ఒరిజినల్ ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Advertisement

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్ లు హీరోయిన్లుగా నటించారు. సినిమా రిలీజ్ కు ముందు వరకు హీరోయిన్ గా ఎక్కువ శృతి హాసన్ నే ప్రమోట్ చేశారు. ఈ సినిమా కోసం ఎక్కువగా ఆమెకే ఎక్కువ పారితోషికం అందింది.

చిన బాలయ్య సరసన శృతి హాసన్ ఓ హీరోయిన్ గా నటించింది అని విషయం తర్వాత అర్థమైంది. ‘వీరసింహారెడ్డి’ మెయిన్ రోల్ కాబట్టి.. అతని భార్య పాత్రలో హనీ రోజ్ కనిపించింది. నిజానికి శృతి హాసన్ పాత్ర కంటే హనీ రోజ్ పాత్రకే ప్రాముఖ్యత ఎక్కువని చెప్పాలి. ఓ పక్క ‘వీరసింహారెడ్డి’ భార్య మీనాక్షిగా మరోపక్క ‘జైసింహారెడ్డి'( చిన్న బాలకృష్ణ) కి తల్లిగా ఈమె చాలా బాగా నటించింది.

రొమాంటిక్ సీన్స్,ఎమోషనల్ సీన్స్, డాన్స్ ఇలా అన్ని రకాలుగా ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. హనీరోజ్ కాస్త పుష్టిగా ఉంటుంది కాబట్టి శృతి హాసన్ కు అత్త పాత్రలో పెట్టారు. కానీ నిజ జీవితంలో శృతి హాసన్ కంటే హనీ రోజ్ వయసులో చిన్నది. ఇప్పుడు హనీ రోజ్ వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.

శృతి హాసన్ వయసు 36 ఏళ్ళు కావడం గమనార్హం. హనీ రోజ్ (Honey Rose) సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె కొంచెం సన్నబడాల్సిన అవసరం ఉందని నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతుంటారు

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news