Pawan Kalyan Bike Cost : పవన్ కళ్యాణ్ నడిపిన ఈ బైక్ కాస్ట్ ఎంతో తెలుసా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ ఫ్యాన్స్ బీభత్సంగా వైరల్ చేసేస్తుంటారు.. ప్రస్తుతం పవన్ చేతిలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. కొద్ది రోజులుగా క్షణం తీరిక లేకుండా రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. సినిమాల పరిస్థితి ఏంటి? షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ‘హరి హర వీరమల్లు’ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు?.. అనౌన్స్ చేసిన మూవీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అనే అయోమయంలో ఉన్న అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ ‘హరి హర వీరమల్లు’ టీం అప్‌డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో.. ఎ.దయాకర రావు నిర్మాతగా.. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ మీద సీనియర్ అండ్ సూపర్ హిట్ ప్రొడ్యూసర్ ఎ.ఎమ్.రత్నం సమర్పిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం.. ‘హరి హర వీరమల్లు’.. పవన్ కెరీర్‌లో తెరకెక్కుతున్న ఫస్ట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ఇది.. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలకపాత్రల్లో కనిపిచంనున్నారని సమాచారం. ఇంతకుముందు పవన్ యాక్షన్ సీన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న పిక్స్, వీడియోస్ ట్రెండ్ అయ్యాయి.

ఇప్పుడు పవర్ స్టార్ లగ్జరీ అండ్ స్టైలిష్ బైక్ నడుపుతున్న ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. దీంతో అభిమానులు స్టిల్స్ షేర్ చేస్తూ.. ఈ బైక్ గురించిన వివరాలు కనిపెట్టారు. పవన్‌కి గన్స్, బైక్స్ అంటే భలే ఇష్టం.. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ గ్యాప్‌లో తన ఫేవరెట్ బైక్ మీద సరదాగా ఓ రౌండ్ వేశారు. ఇక పవన్ రయ్ మంటూ దూసుకెళ్లిన ఈ బైక్ కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రకరకాల యూట్యూబ్ థంబ్ నెయిల్స్ కళ్లముందు కదలాడతాయి కూడా..

పవర్ స్టార్ రైడ్ చేసిన ఈ బైక్ బీఎండబ్ల్యూ కంపెనీది.. BMW R1250 GS మోడల్‌ ఇది.. దీని కాస్ట్ అక్షరాలా రూ. 24 లక్షలు.. ‘అత్తారింటికి దారేది’ లో వాచ్ అమ్మితే బ్యాచ్ సెట్టైపోతుంది అని సమంత అన్నట్టు.. పవన్ బైక్ అమ్మినా కూడా బ్యాచ్ సెటిలైపోవచ్చు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి మూవీస్ కమిట్ అయ్యాడ్ పవన్..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus