Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ధరించిన ఈ వాచ్ ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..!

పవన్ కళ్యాణ్ హీరోగా ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ‘ఓజి'(వర్కింగ్ టైటిల్ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టార్) అనే చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈరోజు అంటే జనవరి 30న ‘ఓజి’ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఓపెనింగ్ డే కి టాలీవుడ్ నుండి చాలా మంది పెద్దలు విచ్చేసి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పవన్ కళ్యాణ్, సుజీత్, డీవీవీ దానయ్యలతో పాటు దిల్ రాజు వంటి వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.

ఆర్ఆర్ఆర్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ ‘ఓజి’ మూవీ ఓపెనింగ్ కు స్టైలిష్ అవతార్ లో దర్శనమిచ్చాడు. పవన్ కళ్యాణ్ ను చాలా కాలం తర్వాత ఇతను స్టైల్ గా చూడటం అని చెప్పాలి. రాజకీయాల్లో బిజీ అయిపోయి వైట్ అండ్ వైట్లోనే ఈయన ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఈరోజు కనిపించిన లుక్ లో కేక అనే విధంగా ఉన్నారు అని చెప్పాలి.

ఇక ఈ కార్యక్రమంలో పవన్ ధరించిన వాచ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ‘పనేరాయ్’ అనే ప్రముఖ కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర రూ. 13.52 లక్షలు అని సమాచారం. అభిమానులు పవన్ ధరించిన ఈ వాచ్ బ్రాండ్ ను ఆన్లైన్ లో సెర్చ్ చేయగా.. దాని ధర చూసి షాకైనట్టు తెలుస్తుంది.

ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల నుండి రూ.60 కోట్ల వరకు పారితోషికం అందుకునే పవన్ కళ్యాణ్ కు ఈ మాత్రం మెయింటెనెన్స్ పెద్ద విశేషం కాదనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది హీరోలు రూ.25 లక్షలకు పైగా విలువగల వాచ్ లను ధరిస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus