మెగాహీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ హీరోకి ఇండస్ట్రీలో క్రేజ్ పెరిగింది. సాధారణంగా హీరోల డెబ్యూ సినిమాలకు రెమ్యునరేషన్ పెద్దగా ఇవ్వరు. కానీ వైష్ణవ్ తేజ్ విషయంలో అలా జరగలేదు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో కావడంతో నిర్మాతలు అతడి రూ.50 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. తొలి సినిమాకే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న వైష్ణవ్.. ఇప్పుడు తన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నాడు.
ఇప్పటికే తన రెండో సినిమాను కూడా పూర్తి చేశాడు ఈ హీరో. క్రిష్ దర్శకత్వంలో రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రూ.75 లక్షలు రెమ్యునరేషన్ గా అందుకున్నాడట వైష్ణవ్ తేజ్. అయితే ఇది ‘ఉప్పెన’ రిలీజ్ కు ముందే కన్ఫర్మ్ అయిన డీల్. అయితే ఇప్పుడు భోగవల్లి ప్రసాద్ తెరకెక్కించనున్న సినిమాకి గాను వైష్ణవ్ రూ.2.5 కోట్లు తీసుకుంటున్నాడట. మూడో సినిమాకే ఇంత మొత్తంలో పారితోషికం అందుకోవడం విశేషం.
మెగా ఫ్యామిలీలో ఏ హీరో కూడా కెరీర్ ఆరంభంలోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోలేదనే చెప్పాలి. కానీ వైష్ణవ్ మాత్రం తన హవా చాటుతున్నాడు. యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో వైష్ణవ్ కి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే ఈ హీరోకి వరుస అవకాశాలు వస్తున్నాయి. మరి తన తదుపరి చిత్రాలతో ఎలాంటి విజయాలు అందుకుంటాడా చూడాలి!