Balakrishna: బాలయ్య సమక్షంలో పుట్టిన రోజు జరుపుకున్న ఈమె ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన భార్య వసుంధరతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఆయన పలు కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి అభిమానులను కూడా కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో భాగంగా ఓ అమ్మాయి బాలకృష్ణ దంపతులతో కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడమే కాకుండా బాలయ్య దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విధంగా బాలకృష్ణ వసుంధర ఆ అమ్మాయిని ఆశీర్వదించడమే కాకుండా తనకు కేక్ తిని పెడుతూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో అందరూ ఈ ఫోటోలపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫోటోలలో బాలయ్య వసుంధర సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆ అమ్మాయి ఎవరు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా బాలయ్యతో కలిసి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు అంటే కచ్చితంగా ఆమెవారి సమీప బంధువు అని చాలామంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు ఆమె ఒక సాధారణ బాలకృష్ణ అభిమాని మాత్రమే.ఇలా బాలకృష్ణ దంపతులు తమ అభిమానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ అరుదైన దృశ్యం యూఎస్ లోని ఫిలడెల్ఫియాలో చోటు చేసుకుంది. బాలకృష్ణ దంపతులు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. దీంతో అక్కడ ఉన్నటువంటి అభిమాని బాలకృష్ణ దంపతుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో బాలయ్య అభిమానులపై చేయి చేసుకుంటారని విమర్శించే వారు ఇప్పుడు సమాధానం చెప్పాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా ఏ హీరో కూడా అభిమానుల పట్ల ఇంత ప్రేమ చూపించరని బాలయ్య అభిమానులు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus