మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram), మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అరవింద సమేత’ నుండి ‘గుంటూరు కారం’ వరకు ఈ ద్వయం సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన సంగతి తెలిసిందే.
అయితే, త్రివిక్రమ్ తన లేటెస్ట్ సినిమాకు తమన్ ను పక్కనపెట్టడంతో.. వీరిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ రూమర్స్‌పై తమన్ ఓపెన్ అయ్యాడు.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ బదులు, యువ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌ను తీసుకున్నారు.
దీనిపై తమన్ స్పందిస్తూ.. “నాకు, త్రివిక్రమ్ సార్‌కు మధ్య ఎలాంటి గొడవలు లేవు. మా నెక్స్ట్ ప్రాజెక్ట్ చాలా పెద్దది కావడంతో, మేమిద్దరం కావాలనే ఈ గ్యాప్‌లో ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. అందుకే ఈ సినిమా కోసం ఆయన కొత్త టీమ్‌తో వర్క్ చేస్తున్నారు” అని క్లారిటీ ఇచ్చేశాడు.
ఇదే ఇంటర్వ్యూలో తమన్ అదిరిపోయే అప్‌డేట్ కూడా ఇచ్చాడు. త్రివిక్రమ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాకు తానే మ్యూజిక్ అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది. అయితే, ఇందులో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తాడా? లేక జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడా? అనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇక వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను 2026 సెకండాఫ్‌లో ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి త్రివిక్రమ్-తమన్ బ్రేకప్ వెనుక అసలు రీజన్ తెలియడంతో అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.