ఈ బాలీవుడ్ హీరో మలయాళం ఎందుకు నేర్చుకుంటున్నాడో తెలుసా?

హీరోలు తమ సినిమాల కోసం రకరకాల విద్యలు నేర్చుకుంటుంటారు. హార్స్ రైడింగ్, డ్యాన్స్, ఫైట్స్ గట్రా ఎన్నో కళలు నేర్చుకుంటారు. కానీ.. ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ (Star Hero) కష్టపడి మలయాళం నేర్చుకుంటున్నాడు. అతడెవరో కాదు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) . ప్రస్తుతం తన కూతురు రాహా కోసం కష్టపడి మలయాళం నేర్చుకుంటున్నాడట. ఆల్రెడీ మలయాళంలో ఒక పాట పాడడం కూడా నేర్చేసుకున్నాడు. “ఉన్ని వావావో” అనే మలయాళ పాట మలయాళీలకు చాలా ఇష్టం.

Star Hero

రణబీర్-ఆలియాల (Alia Bhatt) కుమార్తె రాహాను చూసుకునే నర్స్ ఓ మలయాళీ, ఆమె రాహాను నిద్రపుచ్చుతూ ఆ మలయాళ పాట పాడుతుందంట. అప్పట్నుంచి రాహా కూడా నిద్రకొచ్చినప్పుడల్లా “మమ్మీ వావో, డాడీ వావో” అంటుందట. అందుకని కూతురుని నిద్రపుచ్చడం కోసం రణబీర్ (Star Hero) కూడా ఎంతో కష్టపడి ఆ పాట నేర్చుకున్నాడట. ఇప్పుడు మలయాళం కూడా కొద్దికొద్దిగా నేర్చుకుంటున్నాడట. ఈ విషయాన్ని ఆలియా “కపిల్ శర్మ”షోకి తన కొత్త సినిమా “జిగ్రా” ప్రమోషన్స్ లో భాగంగా వచ్చినప్పుడు రివీల్ చేసింది.

రణబీర్ మాత్రమే కాదు కరణ్ జోహార్ కూడా తన పిల్లల కోసం మలయాళం నేర్చుకున్నాడట. దాంతో ఒక్కసారిగా సదరు మలయాళ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ “ఉన్ని వావావో” పాట కింద నార్త్ ఆడియన్స్ కామెంట్ చేయడం మొదలుపెట్టి ఆ వీడియో సాంగ్ వ్యూస్ ను అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతానికి 15 మిలియన్ వ్యూస్ ఉన్న ఈ పాట ఆలియా పుణ్యమా అని ఇంకెన్ని వ్యూస్ రాబట్టుకుంటుందో చూద్దాం.

ఇకపోతే.. ఆలియా-తారక్  (Jr NTR)  కాంబినేషన్ లో ముంబైలో దేవర (Devara) X జిగ్రా అనే కాన్సెప్ట్ తో షూట్ చేసిన వీడియో ఇంటర్వ్యూ ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఆ వీడియో ఎప్పడు వస్తుందా అని అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ గత 5 సినిమాల థియేట్రికల్ బిజినెస్ లెక్కలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus