కష్టంగా కాటమరాయుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న డైరక్టర్

  • November 28, 2016 / 01:57 PM IST

సాధారణమైన హీరోలను డైరక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే.. స్టార్ లతో సినిమా చేయడం మరొక ఎత్తు. ఇక టెక్నీకల్ గా పట్టున్న స్టార్ హీరోను డైరక్ట్ చేయాలంటే అన్ని విధాలుగా సమర్ధత ఉండాలి. హీరోను తన ప్రతిభతో కన్విన్స్ చేయగలగాలి, లేదా హీరో చెప్పిన విధానంలోనైనా నడుచుకోవాలి. ఈ రెండింటిలో ఏ వైపు వెళ్లాలో తెలియక దర్శకుడు డాలీ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడిస్తోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

గత నెలలో డాలీ చెప్పకుండా నిర్ణయాలు తీసుంటున్నారని ఆగ్రహంతో షూటింగ్ స్పాట్ నుంచి ఆగ్రహంతో పవర్ స్టార్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వీరిద్దరి మధ్య మాటలు లేవని తెలిసింది. డాలీ ఇష్టం లేకుండానే కష్టం గానే సినిమాను కంప్లీట్ చేస్తున్నట్లు టాక్. గతంలో డాలీ గోపాల గోపాల సినిమా కోసం పవన్ ని డైరక్ట్ చేశారు. అప్పుడు ఎటువంటి విభేదాలు రాలేదు. అప్పుడే డాలీ డైరక్షన్ నచ్చి మరో సినిమాకు అవకాశం ఇస్తానని పవన్ చెప్పారు. ఇప్పుడు ఇచ్చారు. గోపాల్ గోపాల సినిమా చేస్తున్నప్పుడు ఉన్న కమ్యూనికేషన్ ఇప్పుడు లేదు. అందుకు కారణం పవన్ మాటలని డాలీ సరిగా అర్ధం చేసుకోకపోవడమేనని చిత్రబృందం వెల్లడిస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus