టాలీవుడ్ లో హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్…చాలా కామన్ అనే చెప్పాలి…అయితే ఆ వార్ చిలికి చిలికి గాలివానగా మరి అభిమానుల మధ్య వార్ గా మారి, వ్యక్తిగతంగా వాళ్ళు దాడులు చేసుకునే వరకూ పోయింది…అయితే ఏ హీరోకు అయినా అభిమానులు ఉండడం…మనం వారిని అభిమానించడం షరా మామూలే..కానీ కొందరు హీరోల అభిమానులు మాత్రం కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి…విషయంలోకి వెళితే…టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమా బాహుబలి2 సినిమా కోసం అందరు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే….అసలు ‘బాహుబలి 2’ సినిమాను చూడొద్దంటూ మెగా ఫ్యాన్స్ పేరుతో కొందరు చేస్తున్న రచ్చ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ మెసేజ్ ను ఎవరు పంపారో తెలియకపోయినా ప్రస్తుతం ఈ మెసేజ్ వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ మెసేజ్ సారాంశం లోకి కాస్త వెళ్ళి చూస్తే…”నువ్వు మెగా ఫ్యామిలీ అభిమానివా? ఒక వారం వరకు బాహుబలి-2 చూడటం మాను.
నువ్వు ఒక చిరు, పవన్, అర్జున్, చరణ్, సాయిధరమ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానివి అయితే ‘బాహుబలి’ థియేటర్ దరిదాపుల్లో కనిపించకు’ అన్న సారాంశంతో ఈ మెసేజ్ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇదంతా ట్రాష్ ని మెగా ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నా…ఇందులో మరో కోణం ఏంటి అంటే…తాజాగా వచ్చిన…చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ పవన్ ‘కాటమరాయుడు’ సినిమాలకు సంబంధించి అదనపు షోలు వేయడానికి స్పెషల్ షోలు వేయడానికి అనుమతులు అప్పట్లో సరిగ్గా లభించక…ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ స్థాయిలో అత్యంత భారీ ఓపెనింగ్స్ రాకపోవడం వల్ల ఫీల్ అయిన మెగా ఫ్యాన్స్ ఇలా చేశారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి…అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఓపెనింగ్స్ కోసం అంత దిగజారే వాళ్ళం కాదు అంటూ కొట్టి పారేస్తున్నారు…మొత్తంగా అదీ మ్యాటర్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.