కొత్త సినిమా పోస్టర్ తో ఆశ్చర్యపరిచిన రాజశేఖర్

Advertisement

నిన్నటినుంచి రాజశేఖర్ నటించిన తాజా చిత్రం “అర్జున” అని కొన్ని పోస్టర్స్ మరియు టీజర్ హల్ చల్ చేస్తున్న విషయాన్ని అందరు గమనించే ఉంటారు. సి.కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో కన్మణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 15న విడుదలవుతోంది. రాజకీయాల నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అసలు ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది అనే విషయం ఎవ్వరికీ తెలియదు. కనీసం సినిమాలో కథానాయకుడిగా నటించడమే కాక ద్విపాత్రాభినయం పోషించిన రాజశేఖర్ కి అయినా ఈ సినిమా వచ్చే వారం విడుదలవుతుందనే విషయం తెలుసో లేదో.


ఇంతకీ ఈ సినిమా దాదాపు ఆరేళ్ళ క్రితం తెరకెక్కిందట. అప్పట్లో అప్పులు కట్టకపోవడంతో ల్యాబ్ లోనే మిగిలిపోయిన ఈ చిత్రాన్ని ఇన్నాళ్లకు ఆంధ్రాలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో విడుదల చేస్తున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రస్తుత రాజకీయ ధోరణికి అద్దం పట్టేలా ఉండడంతో సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మార్చి 15 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus