2020 కోవిడ్ వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పట్లో వీళ్ళు పెళ్లి చేసుకునే వీలు లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది అంటే 2021 లో కూడా చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. 2022 లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. చూస్తుంటే 2023 లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది.
త్వరలోనే ఓ దర్శకుడు తాను ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా ప్రేమ వివాహం. ఆ దర్శకుడు మరెవరో కాదు బాలీవుడ్లో ‘దృశ్యం 2’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన అభిషేక్ పాఠక్. గతేడాది సెప్టెంబరులో ఇతను నటి శివలికా ఒబెరాయ్ కి… టర్కీలో ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అటు తర్వాత ఈ జంట పలు పార్టీల్లో చెట్టాపట్టాలేసుకుని కనిపించారు.
ఇక ఫిబ్రవరిలో గోవా బీచ్ టౌన్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందట. డెస్టినేషన్ వెడ్డింగ్ గా రెండు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక జరుగబోతుందట. వీరి పెళ్లి వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బంధుమిత్రులంతా హాజరుకాబోతున్నారట. ‘ఖుదా హఫీజ్’ సినిమా షూటింగ్ టైంలో శివలికా.. అభిషేక్ లకు పరిచయం ఏర్పడిందట. అది కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ‘ఖుదా హఫీజ్’ చిత్రానికి అభిషేక్ నిర్మాతగా వ్యవహరించాడు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?